యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పదవికి హెన్రీట్టా ఫోర్ రాజీనామా చేశారు. కుటుంబ ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. హెన్రీట్టా రాజీనామాను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆమోదించినట్లు ఐరాస ప్రతినిధి ఫర్హన్ హక్ వెల్లడించారు. యూనిసెఫ్ చీఫ్గా హెన్రీట్టా అందించిన సేవలను గుటెరస్ అభినందించినట్లు తెలిపారు.
హెన్రీట్టా స్థానాన్ని భర్తీ చేసేవరకు ఆమెనే యూనిసెఫ్ చీఫ్గా కొనసాగుతారని హక్ వెల్లడించారు.