కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత పెరిగిపోతుంటే.. అమెరికాలో మాత్రం ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలువడ్డాయి. వరుసగా తొమ్మిదో వారంలోనూ నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టగా.. మే నెలలో నిరుద్యోగిత శాతం 13.3 శాతానికి చేరింది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించి వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం వల్లే నిరుద్యోగిత శాతం తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
అమెరికాలో తగ్గిన నిరుద్యోగిత రేటు! - corona latest news
కరోనా వేళ అమెరికాలో నిరుద్యోగిత రేటు 13.3 శాతం పడిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. లాక్‌డౌన్ నిబంధనలు సడలించి వ్యాపారాలను పునః ప్రారంభించడం వల్లే నిరుద్యోగిత శాతం తగ్గినట్లు పేర్కొన్నాయి.
కరోనా కాలంలో.. అమెరికాలో లక్షలాది మందికి ఉద్యోగాలు!
గత నెలలో 2.5 మిలియన్ల నూతన ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మే నెలలో ఉద్యోగిత రేటు పెరిగినప్పటికీ.. లాక్‌డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొలువులు కోల్పోయిన వారు తిరిగి ఉద్యోగాలు సంపాదించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని.. ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబరులో జరిగే ఎన్నికల సమయం నుంచి వచ్చే ఏడాది వరకు నిరుద్యోగిత రేటు రెండంకెల్లోనే నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.