తెలంగాణ

telangana

ETV Bharat / international

వచ్చే ఐదేళ్లలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల: ఐరాస - ప్రపంచ ఉష్ణోగ్రతలో పెరుగుదల

గ్లోబల్​ వార్మింగ్​పై ప్రపంచ దేశాలను హెచ్చరించింది ఐక్యరాజ్యసమితి. రానున్న ఐదేళ్లలో పారిశ్రామిక సగటు కంటే 1.5డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలిపింది. 2020-24మధ్య కాలంలో కనీసం ఓ ఏడాదిలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడానికి 20శాతం అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎంఓ) వెల్లడించింది.

UN: World could hit 1.5-degree warming threshold in 5 years
మరో ఐదేళ్లలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది: ఐరాస

By

Published : Jul 10, 2020, 6:32 AM IST

రాబోయే ఐదేళ్లలో తొలిసారిగా పారిశ్రామిక సగటు కంటే 1.5 డిగ్రీల (2.7ఫారన్​హీట్​) ఉష్ణోగ్రత పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) వాతావరణ సంస్థ హెచ్చరించింది. గ్లోబల్​ వార్మింగ్​ను నివారించడానికి ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. మావన నిర్మిత గ్రీన్​హౌస్​ ఉద్గారాల వల్ల 1850-1900 మధ్య కాలం కంటే ప్రస్తుతం సుమారు 1 డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది.

2020-24మధ్య కాలంలో కనీసం ఓ ఏడాదిలో 1.5డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడానికి 20శాతం అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎంఓ) తెలిపింది. పారిశ్రామిక సగటు కంటే 0.91 నుంచి 1.59 డిగ్రీల ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రత ఆ మధ్య కాలంలో కనిపిస్తాయని చెప్పింది. బ్రిటన్​ నేతృత్వంలోని మెట్​ కార్యాలయం ఇదే విషయాన్ని వెల్లడించింది.

2015 పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను చేరుకోవడంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఓ అధ్యయనం తెలిపిందని డబ్ల్యుఎంఓ చీఫ్ పెట్టేరి తాలాస్​ తెలిపారు. అయితే ఆ ఒప్పందంలో నిర్ణయించుకున్న లక్ష్యం కంటే ఇది తక్కువే అని అన్నారు తాలాస్.

భూమి వేడెక్కడానికి కారణమైన కార్బన్ డైఆక్సైడ్ వంటి ఉద్గారాలను తగ్గించే సూచనలు దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేసినవి. వీటిని కరోనాకు అనుకరించవద్దని డబ్ల్యుఎంఓ తెలిపింది. వాతావరణంలో కార్బన్​ డైఆక్సైడ్ ​దీర్ఘకాలం ఉంటుంది. ఈ ఏడాది ఉద్గారాల తగ్గుదల ప్రభావం కార్బన్​ డైఆక్సైడ్ వాతావరణ సాంద్రతలను తగ్గించదని... ఇది ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతుందని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:ఆ దేశ రాజధాని నగర మేయర్ అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details