ప్రపంచవ్యాప్తంగా ఆహార అత్యవసర స్థితి ఏర్పకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మందికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న దాదాపు 14 కోట్ల మంది పిల్లల్లో సరైన ఎదుగుదల లేదని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభాకు సరిపడిన దానికంటే ఎక్కు ఆహారమే ఉత్పత్తి అవుతున్నప్పటికీ పేదల ఆకలి తీర్చడంలో మన ఆహార వ్యవస్థలు విఫలమవుతున్నట్లు వ్యాఖ్యానించారు.