నిరంతరం బాంబుల మోతలతో అట్టుడికే సిరియా, సుడాన్ వంటి దేశాల్లో కరోనా టీకా పంపిణీ కోసం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ). ఘర్షణ ప్రాంతాల్లోని లక్షలాది మందికి వ్యాక్సిన్ అందించేందుకు మానవతా దృక్పథంతో ఆయా దేశాలు సాయుధ పోరాటాలకు విరామం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఈ తీర్మానానికి 112 దేశాలు మద్దతు పలికాయి. సిరియా, యెమెన్ నుంచి సెంట్రల్ ఆప్రికా రిపబ్లిక్, మాలి, సుడాన్, సోమాలియా వరకు ప్రధాన సంఘర్షణ ప్రాంతాల్లో యుద్ధాలకు తక్షణం విరామం ఇవ్వాలని గత ఏడాది జులై 1న యూఎన్ఏసీ కౌన్సిల్ చేసిన డిమాండ్‌ను పునరుద్ఘాటించాయి సభ్య దేశాలు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని ఘర్షణ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేపట్టాలని కోరినట్లు గుర్తు చేశాయి. ఇదే విషయాన్ని 2020, మార్చి 23న ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా కోరారు.
వర్చువల్‌గా జరిగిన ఈ సమేవశంలో తీర్మానానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన ఓట్లను ప్రకటించారు బ్రిటన్ ఐరాస రాయబారి, ప్రస్తుత కౌన్సిల్ అధ్యక్షురాలు.. బార్బరా వూడ్వర్డ్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.