మూడు దశాబ్దాల క్రితం గ్రీన్లాండ్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తెలిపింది. ఉత్తరార్ధ గోళంలో రికార్డయిన కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదేనని తెలిపింది. 1991 డిసెంబర్ 22న 'క్లింక్' ప్రాంతంలో ఉన్న వాతావరణ కేంద్రం వద్ద -69.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ధ్రువీకరించింది. గ్రీన్లాండ్ మంచు ఫలకలోని ఎత్తైన ప్రాంతానికి సమీపంలోనే క్లింక్ ప్రదేశం ఉన్నట్లు పేర్కొంది.
తాజా ఉష్ణోగ్రతతో రష్యాలోని ఒయిమికోన్లో ఇదివరకు నమోదైన రికార్డు బద్దలైంది. ఈ ప్రాంతంలో 1897, 1993లో -67.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
"వాతావరణ మార్పులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దృష్టంతా అధిక ఉష్ణోగ్రతల రికార్డులపైనే ఉంది. తాజాగా గుర్తించిన శీతల ఉష్ణోగ్రత వివరాలు.. భూమి మీద ఉన్న వైరుద్ధ్య పరిస్థితులను జ్ఞాపకానికి తెస్తోంది."