అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. 26 జిల్లాల్లో వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. 70 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అస్సామీలకు సాయం చేసేందుకు ముందుకువచ్చింది ఐక్యరాజ్యసమితి. భారత ప్రభుత్వం కోరితే.. అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి వెల్లడించారు.
''భారీ వర్షాల కారణంగా భారత్లోని అసోం, నేపాల్లలో సుమారు 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరో 189 మంది మృతి చెందినట్లు అధికారుల వల్ల తెలిసింది. అవసరమైతే భారత ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఐరాస సిద్ధంగా ఉంది.''
-స్టెఫాన్ డుజారిక్, ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి