ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. 71 ఏళ్ల గుటెరస్‌కు.. న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్లో మోడెర్నా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు వైద్యులు. వ్యాక్సినేషన్ అనంతరం హర్షం వ్యక్తం చేశారు గుటెరస్.
వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్ని దేశాల్లో ప్రారంభమైందని.. అందరికీ అందుబాటులో ఉండేలా ఆయా దేశాలు చర్యలు చేపట్టాలని తెలిపారు గుటెరస్. ప్రజలు కూడా వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.