జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనపై నిర్ణయం తెలిపేందుకు మరింత సమయం కావాలని చైనా కోరినట్లు ఐక్యరాజ్యసమితి సచివాలయం వెల్లడించింది. ప్రతిపాదనపై గడువు ముగిసే సమయానికి గంట ముందు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు భద్రతా మండలి ఆంక్షల కమిటీ సభ్యులకు తెలిపింది.
మసూద్‌ను 1267 ఆంక్షల జాబితాలో చేర్చాలని ఐరాస భద్రతా మండలిలో గతనెల 27న శాశ్వత సభ్యులైన ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాలు ప్రతిపాదించాయి.
" మసూద్ అజార్‌ను ఆంక్షల జాబితాలో చేర్చాలన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ప్రతిపాదనపై చైనా మరింత సమయం కావాలని కోరింది." - ఐరాస