తెలంగాణ

telangana

ETV Bharat / international

43 శాతం పాఠశాలల్లో నో హ్యాండ్​వాష్​: ఐరాస - పాఠశాల్లో కనీన సౌకర్యాలు

కరోనా వ్యాప్తిలోనూ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాలు భావిస్తున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పాఠశాలల్లో చేతులను శుభ్రం చేసుకోవటానికి కావాల్సిన నీరు, సబ్బు లేవని పేర్కొంది.

UN says 43% of schools lack water, soap
43 శాతం పాఠశాలల్లో నో హ్యాండ్​వాష్​:ఐరాస

By

Published : Aug 13, 2020, 4:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పాఠశాలల్లో చేతులను శుభ్రం చేసుకోవటానికి అవసరమైన నీరు, సబ్బు వంటి సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రస్తుత కరోనా విజృంభణలో పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వాలు యోచిస్తున్న తరుణంలో ఓ నివేదికను విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 818 మిలియన్ల మంది విద్యార్థులకు చేతులు కడుక్కోవటానికి సరైన సదుపాయాలు లేవని తెలిపింది. వీరిలో మూడింట ఒక వంతు మంది చిన్నారులు సబ్​ సహారన్​ ఆఫ్రికాలోనే ఉన్నారని తెలిపింది. పాఠశాలలు తిరిగి ప్రారంభించే సమయంలో ఆర్థిక, సామాజిక విషయాలతో పాటు ఆరోగ్య సదుపాయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. మూడింట ఒకవంతు పాఠశాల్లో తాగునీరు సదుపాయాలు పరిమితంగా లేదా అసలు లేవని పేర్కొంది.

ఇదీ చూడండి:తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details