నిషేధిత బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే యూఎన్ నిపుణుల ఆదేశాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఐక్యరాజ్య భద్రతా మండలి. ఈ మేరకు అమెరికా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు శుక్రవారం ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికలకు సమాధానంగా గురువారం రెండు క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. ఇరు దేశాల మధ్య అణు చర్చలు నిలిచిపోయిన వేళ.. బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ప్రయోగాలు చేపట్టింది కిమ్ సర్కారు.