మహిళల నేతృత్వంలోని సంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల చీఫ్ మార్క్ లాకాక్.. 2.5 కోట్ల డాలర్లు విడుదల చేశారు. ఈ సంస్థలు లింగ ఆధారిత హింసను నిరోధించి, ప్రతిస్పందించగలవని భావించారు.
మహిళా ప్రాజెక్టులకు ప్రోత్సాహకంగా భారీగా నిధులు - మహిళల ప్రాజెక్టులకు నిధులు
మహిళలపై హింసను నిరోధించేందుకు ఐరాస మానవతా వ్యవహారాల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ ఆధారిత హింసపై పోరాడుతున్న సంస్థలకు ప్రోత్సాహం కోసం 2.5 కోట్ల డాలర్లను విడుదల చేసింది.
ఐరాస
ఈ విడుదలైన నిధులు ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (1.7 కోట్ల డాలర్లు) , ఐరాస మహిళల(80లక్షల డాలర్లు)కు అందించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలకు కనీసం 30 శాతం.. బాధితుల వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం మిగతా మొత్తాన్ని వెచ్చించాలని సూచించారు మార్క్.
ఇదీ చూడండి:బాల్యంలోనే ఎయిడ్స్ ముప్పు: యూనిసెఫ్