అగ్రరాజ్యంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. రానున్నసెలవు సీజన్లో అమెరికా ప్రజలు.. తమ బంధువులు, కుటుంబసభ్యులను ఆలింగనం చేసుకోవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.
"ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న దేశం అమెరికా. అత్యాధునిక సాంకేతికతకు నిలయమైన అగ్రరాజ్యంలో నిమిషానికి ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడో వంతు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆలింగనం చేసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు."