ధనిక దేశాలు తమ పౌరులకు కరోనా వ్యాక్సిన్‌ను అందించడంతో.. ప్రపంచంలో అందరికీ టీకా అందుబాటులో ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నొక్కిచెప్పారు. జర్మనీ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఫైజర్ సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆ దేశ శాస్త్రవేత్తలను పొగిడారు.
"జర్మన్ శాస్త్రవేత్తల విజయాలు గర్వంచదగ్గవి. ప్రపంచంలో అందరికి వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచడమే మన ధ్యేయం.ఇది ప్రజల వాక్సిన్."