దేశంలో గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న పౌర నిరసనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనల నేపథ్యంలో బలగాలను ఎక్కువగా ఉపయోగించడం సరికాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరిస్ తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛకు గౌరవమివ్వాలని పిలుపునిచ్చారు.
'పౌర' నిరసనలపై ఐరాస ఆందోళన - UN concerned over violence during protests against CAA
'పౌర' నిరసనలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. నిరసనల్లో హింస చెలరేగడం బాధాకరమని వ్యాఖ్యానించింది. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని పిలుపునిచ్చింది.
'పౌర' నిరసనలపై ఐరాస ఆందోళ
భారత్లో నిరసనలు ఉద్రిక్తంగా మారడం బాధాకరమని అభిప్రాయపడ్డారు గుటెరిస్ ప్రతినిధి స్టిఫానే డుజార్రిక్. ప్రజలు శాంతించాలని కోరారు.
అయితే పౌరసత్వ చట్ట సవరణను భారత ప్రభుత్వం అనేకమార్లు సమర్థించింది. ఇతర దేశాల్లో వివక్ష, హింసకు గురవుతున్న మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టం తెచ్చినట్టు వివరించింది. ఇది ఎంతో ప్రయోజనకరమని, దీనిని స్వాగతించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. దేశంలోని ఏ ఒక్క పౌరుడికీ ఇది వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.