తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ను ప్రశంసించిన ఐరాస చీఫ్​ - ఐక్యరాజ్యసమితి చీఫ్

ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేస్తునందుకు భారత్​ను అభినందించారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి​ ఆంటోనియో గుటెరస్​. అంతేకాకుండా ఐరాస శాంతిపరిరక్షకులకు 2లక్షల కరోనా టీకా డోసులను భారత్​ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

UN chief
ఆ విషయంలో భారత్​ను మరోసారి ప్రశంసించిన ఐరాస చీఫ్​

By

Published : Feb 21, 2021, 12:49 PM IST

కరోనా పోరులో భారత్​ కృషిని ఐక్యరాజ్యసమితి చీఫ్​ ఆంటోనియో గుటెరస్​ కొనియాడారు. ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను భారత్​ పంపిణీ చేస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2 లక్షల కరోనా టీకాలను ఐరాస శాంతి పరిరక్షుల కోసం ఇవ్వడం పట్ల భారత్​కు ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచ దేశాలకు టీకాలను, కరోనా కిట్​లను పంపిణీ చేస్తూ భారత్​ నాయకత్వ పాత్ర పోషిస్తుందని ఆంటోనియో ప్రశంసించారని ఐరాసలో భారత రాయబారి టీఎస్​ తిరుమార్తి అన్నారు. అంతేకాకుండా ఐరాసకు 2లక్షల టీకా డోసులను ఇచ్చినందుకు విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​కు అంటోనియో ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు. కరోనాతో అతలాకుతలమైన ప్రస్తుత సమయంలో భారతదేశ టీకా ఉత్పత్తి సామర్థ్యాలే ప్రపంచానికి ఆస్తి వంటిదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇదివరకు ప్రశంసించారు.

భారత్​లో సీరం ఇన్​స్టిట్యూట్​ తయారుచేస్తున్న కొవిషీల్డ్​ టీకాకు గత వారమే ఐరాస అత్యవసర అనుమతిని ఇచ్చింది.

ఇదీ చూడండి:'భారత్ టీకా ఉత్పత్తి సామర్థ్యాలే ప్రపంచానికి ఆస్తి'

ABOUT THE AUTHOR

...view details