ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘంలో తిరిగి చేరాలన్న అమెరికా నిర్ణయాన్ని స్వాగతించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. మండలిలో కీలకమైన అమెరికా అభిప్రాయాన్ని వినేందుకు ఐరాస ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు.
అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన గుటెరస్ - Biden Government news
అమెరికా.. ఐరాస మానవ హక్కుల సంఘంలో తిరిగి చేరాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. బైడెన్ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించారు.
ఆ విషయంలో అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన గుటెరస్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్న అధ్యక్షుడు జో బైడెన్.. తాజాగా మానవ హక్కుల సంఘంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఐరాసలో కీలక మార్పులను కోరిన అగ్రదేశం.. అవి కార్యరూపం దాల్చకపోవడం వల్ల మూడేళ్ల కిందట వైదొలిగింది.
ఇదీ చూడండి:తిరిగి ఐరాస మానవహక్కుల సంఘంలోకి అమెరికా!