తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్ హింసాకాండపై గుటెరస్ గరం! - Myanmar's military killings

మయన్మార్​లో సైనిక అరాచకాలు పెరిగిపోవడంపై ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులను సైన్యం నిర్బంధించడం, హత్య చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సైనిక అణచివేతకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

UN chief Guterres appalled by escalating violence in Myanmar by military junta
మయన్మార్ హింసాకాండపై గుటెరస్ గరం!

By

Published : Mar 16, 2021, 11:22 AM IST

మయన్మార్​లో రోజురోజుకు పెరిగిపోతున్న హింస పట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారుల హత్యలు, సైన్యం ఏకపక్ష అరెస్టులను ఖండించారు. నిర్బంధంలో ఉన్నవారిని హింసించడం ప్రాథమిక మానవ హక్కులకు వ్యతిరేకమని అన్నారు. నిగ్రహం పాటించాలంటూ ఐరాస భద్రతా మండలి చేస్తున్న ప్రకటనలకు.. మయన్మార్ సైనిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు.

మయన్మార్​లో సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేయాలని గుటెరస్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సహా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చొరవ తీసుకునేందుకు ఐరాస ప్రత్యేక రాయబారిని మయన్మార్ సందర్శనకు అనుమతించాలని సైనిక ప్రభుత్వాన్ని కోరారు.

138 మంది బలి

ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసిన మయన్మార్ సైన్యం.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రభుత్వ నేతలను నిర్బంధించింది. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటివరకు సైన్యం హింసాకాండలోకనీసం 138 మంది మరణించినట్లు ఐరాస తెలిపింది.

ఇదీ చదవండి:జో బైడెన్​ సర్కార్​కు 'కిమ్' తొలి హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details