తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. ఉద్రిక్తతలు చెలరేగుతున్న పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి ఎరి కనెకో వివరాలు వెల్లడించారు.
" భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి హింస చెలరేగి, మరణాలు సంభవించినట్లు వచ్చిన నివేదికలతో ఆందోళన చెందాం. ఇరు వైపులా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు మాకు సానుకూల సమాచారం అందింది."