ఆసియన్లు, ఆసియా సంతతికి చెందినవారిపై జరుగుతున్న అన్ని రకాల హింసాత్మక దాడులను ఆపాలని పిలుపునిచ్చారు ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్. కరోనా కాలంలో ఆసియన్లే లక్ష్యంగా దాడులు జరగడంపై గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఐరాస ప్రతినిధి ఫర్హాన్ హక్ పేర్కొన్నారు.
"ప్రపంచం భయకరమైన ఘోరాలను చూసింది. పని ప్రదేశాల్లో వివక్ష చూపడం, పాఠశాలల్లో బెదిరింపులకు పాల్పడటం, మాటలు ద్వారా, భౌతికంగా వేధింపులు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని ప్రేరేపించడం లాంటి ఎన్నోఘోరాలు చూసింది. కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా ఆసియన్ మహిళలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇటువంటి హింసలన్ని మానుకోవాలని కోరుతున్నాం."
- ఫర్హాన్ హక్, ఐరాస ప్రతినిధి