తెలంగాణ

telangana

ETV Bharat / international

అసాంజే సమాధానం చెప్పాల్సిందే: హిల్లరీ

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టుపై హిల్లరీ క్లింటన్ స్పందించారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డెమోక్రాట్ల ఈమెయిల్స్​ను బహిర్గతం చేయడంపై అసాంజే ఇప్పటికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అసాంజే సమాధానం చెప్పాల్సిందే: హిల్లరీ

By

Published : Apr 12, 2019, 7:53 PM IST

అసాంజే సమాధానం చెప్పాల్సిందే: హిల్లరీ

డెమోక్రాట్ల ఈవెుయిల్స్​ సమాచారాన్ని బహిర్గతం చేసిన విషయంపై వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజే సమాధానం చెప్పి తీరాలని డిమాండ్​ చేశారు హిల్లరీ క్లింటన్​. కేసు నమోదైనందుకైనా అసాంజే వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. భర్త బిల్​ క్లింటన్​తో కలిసి అమెరికాలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు హిల్లరీ.

"ఇది జర్నలిజాన్ని శిక్షించడం కాదు. మిలటరీ కంప్యూటర్​ను హ్యాక్​ చేసి అమెరికా సమాచారాన్ని దొంగిలించినందుకు తీసుకునే చర్య. ఈ కేసు న్యాయ విచారణ ఏ విధంగా సాగుతుందో చూడాలి. అసాంజే చేసిన దానికి ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. బహుశా ట్రంప్ అమెరికాలో స్వాగతం పలకబోయే మొదటి విదేశీయుడు అసాంజేనే కావచ్చు."

-హిల్లరీ క్లింటన్.

2016లో అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ల తరఫున ట్రంప్​కు పోటీగా బరిలో నిలిచారు హిల్లరీ. ఆ సమయంలో రష్యా నిఘా అధికారులు దొంగిలించిన డెమోక్రాట్ల ఈమెయిల్స్ సమాచారాన్ని వికీలీక్స్ బహిర్గతం చేసింది. ఇది హిల్లరీ ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపింది. సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు అసాంజేను అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ప్రశంసించారు.

ఏడేళ్లుగా లండన్​లోని ఈక్వెడార్​ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అసాంజేను గురువారం లండన్​ పోలీసులు అరెస్టు చేశారు. అసాంజేకు రాజకీయ ఆశ్రయాన్ని విరమించుకుంటామని ఈక్వెడార్​ ప్రకటించిన వెంటనే ఈ పరిణామాలు జరిగాయి. మాజీ సైనికాధికారితో కలిసి కుట్ర పన్ని ప్రభుత్వ సమాచారాన్ని దొంగిలించారని అసాంజేపై అభియోగాలు నమోదు చేసిందిఅమెరికా.

ABOUT THE AUTHOR

...view details