మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నిరసనకారులపై సైన్యం అనుసరిస్తున్న అణచివేత ధోరణిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు శాంతియుతంగా చేస్తున్న నిరసనల్లో.. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 138 మంది ప్రాణాలు కోల్పోయారని ఐరాస తెలిపింది.
మయన్మార్ నిరసనల్లో 138 మంది మృతి: ఐరాస - UNO
మయన్మార్‌లో నిరసనకారులపై సైన్యం అనుసరిస్తున్న అణచివేత వైఖరిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు శాంతియుతంగా చేస్తున్న నిరసనల్లో ఫిబ్రవరి 1 నుంచి 138 మంది మరణించినట్లు పేర్కొంది.
మయన్మార్ నిరసనల్లో 138 మంది మృతి: ఐరాస
ఆదివారం ఒక్క రోజే యాంగూన్ నగరంలో 38 మంది నిరసన కారులు ప్రాణాలు కోల్పోయారన్న ఐరాస ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్.. అంతకుముందు శనివారం నాడు 18 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా చేపట్టిన నిరసనలపై సైన్యం ఉక్కుపాదం మోపడంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించినట్లు డుజారిక్ తెలిపారు. తరచూ మానవ హక్కుల ఉల్లంఘనకు సైన్యం పాల్పడుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు.