Ukraine Tension: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసింది అమెరికా. తూర్పు ఉక్రెయిన్లోని తమ జనాభాపై ఉక్రెయిన్ సైన్యం దాడికి పాల్పడాలని రష్యా యోచిస్తోందని.. ఆ సాకుతో పొరుగు దేశంపై సైనిక చర్యకు దిగేందుకు కుట్రలు పన్నుతోందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ ఆరోపించారు.
Ukraine Tension: 'ఉక్రెయిన్పై దాడికి రష్యా కుట్ర' - Ukraine Tension updates
Ukraine Tension: ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ బలగాలు రష్యన్లపై దాడి చేసినట్లు చిత్రించి.. తద్వారా ఉక్రెయిన్పై దాడి చేయాలని రష్యా యోచిస్తోందని పెంటగాన్ పేర్కొంది. ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉన్నట్లు వెల్లడించింది.
![Ukraine Tension: 'ఉక్రెయిన్పై దాడికి రష్యా కుట్ర' ukraine tension](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14366224-thumbnail-3x2-ukrain.jpg)
"ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. రష్యన్ సార్వభౌమ భూభాగంపై లేదా రష్యన్ మాట్లాడే ప్రజలపై ఉక్రెయిన్ మిలిటరీ లేదా ఇంటెలిజెన్స్ దళాలు ద్వారా బూటకపు దాడికి పాల్పడాలని రష్యా యోచిస్తోంది. ఇందుకు రష్యా కొన్ని గ్రాఫిక్ వీడియోను రూపొందించబోతోంది. కొన్ని ప్రదేశాలు, మిలటరీ పరికరాలు ధ్వంసం చేసినట్లు.. మృతదేహాలు, బాధితులను ఉండేట్లు గ్రాఫిక్ వీడియోను తయారు చేస్తుంది" అని కిర్బీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను కిర్బీ బయటపెట్టలేదు.