అధ్యక్షుడి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జోబిడెన్‌పై ఆరోపణలు చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్న వార్తలపై అమెరికా చట్టసభల్లో వాడీవేడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో సంబంధాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వివరణ ఇచ్చారు. తామిద్దరి మధ్య ఏ విధమైన క్విడ్ ప్రోకో ఒప్పందం జరగలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ అమెరికా స్థానిక మీడియా ఛానెల్ ముఖాముఖిలో ధ్రువీకరించారు.
"నేను ట్రంప్‌తో ఎలాంటి క్విడ్ ప్రోకో ఒప్పందం చేసుకోలేదు. నా స్వభావం అలాంటిది కాదు... మమ్మల్ని యాచకులుగా చూపించుకోవాలని నేను అనుకోవట్లేదు."
-వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు.
ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటనను పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.