Ukraine crisis: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు నిప్పుల వర్షం కురిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు తాము అండగా నిలుస్తామన్న బైడెన్.. ఆయుధాలు సరఫరా చేస్తామన్నారు. అలాగే శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. కీవ్‌కు ఆర్థిక, ఆహారంతో పాటు ఇతర మానవతా సాయం చేస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకు ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు ఉన్నాయని నిర్ధరించుకుంటాం. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డబ్బు, ఆహారం, మానవతా సహాయాన్ని పంపుతాం. ఉక్రెయిన్ శరణార్థులను స్వాగతిస్తాం" అని బైడెన్ చెప్పారు.
అధ్యక్షుడు బైడెన్.. ఉక్రెయిన్‌కు అదనపు ఆయుధాలు, పరికరాల కోసం 200 మిలియన్ల డాలర్లు సాయం అందించినట్లు శ్వేతసౌధం శనివారం (స్థానిక కాలమానం) తెలిపింది. "ఈ రోజు అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు అదనపు ఆయుధాలు, పరికరాల కోసం 200 మిలియన్ డాలర్లు సాయం అందించారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు 1.2 బిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని ఉక్రెయిన్‌కు అమెరికా అందించింది." అని శ్వేతసౌధం ట్వీట్ చేసింది.