తెలంగాణ

telangana

ETV Bharat / international

Ukraine crisis: ఉక్రెయిన్-రష్యా వివాదం.. భారత్​ కీలక వ్యాఖ్యలు - russia ukraine issue

Ukraine crisis: ఉక్రెయిన్-రష్యాల మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించే పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు యూఎన్‌లో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి. ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న వేళ సత్వర, నిర్మాణాత్మక దౌత్యం అవసరమని చెప్పారు.

Ukraine crisis
ukraine india news

By

Published : Feb 18, 2022, 6:55 AM IST

Ukraine crisis: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నవేళ.. సత్వర, నిర్మాణాత్మక దౌత్యం అవసరమని భారత్ అభిప్రాయపడింది. భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న యూఎన్‌లో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి.. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించే పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఉద్రిక్తతలను పెంచే చర్యలను అన్నిపక్షాలు విడనాడాలని అన్నారు.

అన్ని పక్షాలతో భారత్‌ సంబంధాలు కలిగి ఉందన్న తిరుమూర్తి సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉన్న 20 వేల మంది భారతీయుల రక్షణ తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు.. కేంద్రం చర్యలు చేపట్టింది. ఎయిర్ బబుల్ ద్వారా భారత్ , ఉక్రెయిన్ మధ్య రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై పరిమితి తొలగించింది. భారత్, ఉక్రెయిన్ మధ్య డిమాండ్ తగ్గట్లు.. విమాన సర్వీసుల సంఖ్యను పెంచుకోవచ్చని పౌర విమానయానశాఖ తెలిపింది.

ఇదీ చూడండి:మరో రెండు రోజుల్లో ఉక్రెయిన్​పై రష్యా దాడి: బైడెన్

ABOUT THE AUTHOR

...view details