తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 9:39 AM IST

ETV Bharat / international

ఉద్యోగ వీసాల రద్దుకు అమెరికా ప్రణాళికలు!

హెచ్​1బీ, హెచ్​2బీ సహా విద్యార్థి వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ మేరకు శ్వేతసౌధం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వాల్​స్ట్రీట్ జర్నల్ తెలిపింది. తీవ్రంగా పెరిగిన నిరుద్యోగం నేపథ్యంలో స్థానికులకే అవకాశాలు దక్కేలా ఈమేరకు చర్యలు చేపడుతోంది అగ్రరాజ్యం.

Trump admin working to temporarily ban work-based visas
ఉద్యోగ వీసాలను రద్దు చేసేందుకు అమెరికా ప్రణాళికలు

లాక్‌డౌన్‌ వల్ల నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోయిన వేళ విదేశీయులకు తమ దేశంలో ఉద్యోగాలు కల్పించే వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని అమెరికా యోచిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ సలహాదారులు ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఈ నెలలోనే నిర్ణయం ఉంటుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో గత రెండు నెలల్లో 3 కోట్ల30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరికి అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే హెచ్​1బీ, హెచ్​2బీ సహా విద్యార్థి వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని అగ్రరాజ్యం భావిస్తోంది.

భారతీయులకే నష్టం..

హెచ్​1బీ వీసా ద్వారా భారతీయులే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. విదేశాలకు చెందిన ఐటీ, ఇతర సాంకేతిక నైపుణ్యం గల వారిని ఈ వీసా ద్వారానే అమెరికా సంస్థలు ఉద్యోగాల్లో చేర్చుకుంటాయి. దాదాపు 5,00,000 మంది హెచ్​1బీ వీసా కలిగి ఉన్నారు. వీరిలో భారతీయులు, చైనీయులే అధికం.

రికార్డు స్థాయిలో..

ఏప్రిల్​లో అమెరికాలో నిరుద్యోగ శాతం 14.7కు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఒక్క నెలలో ఈ స్థాయిలో నిరుద్యోగులు పెరడటం 1948తర్వాత ఇదే తొలిసారి. రెండో త్రమాసికంలో అమెరికా ఆర్థిక వృద్ధి మైనస్​ 15 నుంచి మైనస్​ 20 వరకు పతనమవుతుందని శ్వేతసౌధం అధికారులు అంచనా వేశారు.

ఇమిగ్రెంట్​ వీసాలా జారీని తాత్కాలికంగా 60 రోజుల పాటు నిలిపివేస్తూ గత నెలలో ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. ప్రస్తుత పరిస్థితిలో మరో ఏడాది కాలం వరకు వీసాలను రద్దు చేసే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details