తెలంగాణ

telangana

ETV Bharat / international

1300 అడుగుల ఎత్తులో అన్నాచెల్లెళ్ల రోప్​వాక్​ - america

న్యూయార్క్​లో ఇద్దరు అన్నాచెల్లెళ్లు అత్యంత సాహోసోపేతమైన స్టంట్​ చేసి సరికొత్త రికార్డ్​ సృష్టించారు. 1300 అడుగుల ఎత్తులో రెండు 25 అంతస్తుల భవనాల మధ్య రోప్​ వాక్​ చేసి అబ్బుర పరిచారు.

1300 అడుగుల ఎత్తులో అన్నాచెల్లెళ్ల విన్యాసాలు

By

Published : Jun 24, 2019, 3:04 PM IST

1300 అడుగుల ఎత్తులో అన్నాచెల్లెళ్ల విన్యాసాలు

న్యూయార్క్‌లో ప్రపంచ ప్రఖ్యాత విన్యాసకులైన ఇద్దరు అన్నాచెల్లెళ్లు అత్యంత సాహోసోపేతమైన స్టంట్‌ చేసి సరికొత్త రికార్డ్‌ సృష్టించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ స్టంట్‌ను చూసి వేలాదిమంది ఆశ్చర్యపోయారు. 25 అంతస్తుల రెండు ఆకాశహర్మ్యాల మధ్య రోప్‌ వాక్‌ చేసి ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్‌ స్క్యేర్‌ను దాటారు.

దాదాపు 1300అడుగుల ఎత్తులో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎదురెదురుగా రోప్‌ వాక్‌ చేశారు. మధ్యలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడగా.. తీగపై చెల్లి లిజనా వాలెండా కూర్చుంటే అన్న నిక్‌ వాలెండా ఆమెను దాటుకుంటూ గమ్యాన్ని చేరుకున్నాడు. అత్యంత సాహోసోపేతమైన ఈ స్టంట్‌ను ఏబీసీ న్యూస్​ ప్రత్యక్షప్రసారం చేసింది. వేలాది మంది ఉత‌్కంఠగా చూశారు.

నిక్‌ వాలెండా గతంలో ప్రపంచ ప్రఖ్యాత నయాగర జలపాతంపైనా రోప్‌ వాక్‌ చేశాడు.

ఇదీ చూడండి: రయ్​ రయ్​: 'వరల్డ్​​ రోయింగ్​ కప్​'లో దూసుకెళ్లిన బోట్లు

ABOUT THE AUTHOR

...view details