తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2019, 2:10 PM IST

Updated : Dec 5, 2019, 2:38 PM IST

ETV Bharat / international

అమెరికా నౌకాశ్రయంలో కాల్పులు- రాకేశ్ బృందం సురక్షితం

అమెరికాలోని ఓ నౌకాశ్రయం వద్ద దుండగుడు కాల్పులు జరిపి ఇద్దరిని బలిగొన్నాడు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో భారత వాయుసేన సారథి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా బృందం ఘటనా స్థలంలోనే ఉంది. వారికి ఎలాంటి హాని జరగలేదని వాయుసేన స్పష్టం చేసింది.

two-killed-in-hawaiis-pAearl-harbor-base-shooting-and-indian-air-force-chief-rsk-bhadauria-is-present-on-spot
అమెరికా నౌకాశ్రయంలో కాల్పులు- భారత వాయుసేన బృందం సురక్షితం

అమెరికా హవాయ్​లో పెరల్​ హార్బర్​ నౌకాశ్రయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఇద్దరిని బలిగొని... ఆత్మహత్య చేసుకున్నాడు.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:30 నిమిషాల ప్రాంతంలో నావికా దళ దుస్తుల్లో ఓ ఆగంతుకుడు నౌకాశ్రయం వద్ద దాడికి తెగబడ్డాడు. ప్రతిస్పందించిన ముగ్గురు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరు అధికారులు కాసేపటికే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాల్పులతో నౌకాశ్రయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికాలో ఉన్న నాలుగు నౌకాశ్రయాల్లోకెల్లా కీలకమైన పెరల్​ హార్బర్​ను మూసివేశారు అధికారులు.

మనోళ్లు సురక్షితం...

కాల్పులు జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా, ఆయన బృందంతో కలిసి ఉన్నారు. ఫసిఫిక్​ వాయు దళాధిపతుల సమావేశం (పాక్స్​-2019) కోసం ఆ బృందం అక్కడకు వెళ్లింది.

దుండగుడి దాడి కారణంగా అమెరికాలో ఉన్న భారతీయులకు ఎలాంటి ఆపద కలగలేదని స్పష్టం చేసింది భారత వైమానిక దళం.

ఇదీ చదవండి:'''దిశ' నిందితుల్ని ఉరి తీసే వరకు ఆమరణ దీక్ష''

Last Updated : Dec 5, 2019, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details