అమెరికాలో ఇడా హరికేన్(ida hurricane) ధాటికి ఏర్పడిన ఆకస్మిక వరదల్లో(america floods 2021) ఇద్దరు భారతీయ అమెరికన్లు(indian american) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. మృతులు మాలతీ కంచే (46), ధనుశ్ రెడ్డి (31)లగా అధికారులు గుర్తించారు.
స్థానిక మీడియా వివరాల ప్రకారం..
మాలతీ కంచే బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఆమె కుమార్తెతో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె వాహనం బ్రిడ్జ్వాటర్ రూట్ నంబర్ 22 వద్ద వరద నీటిలో చిక్కుకుంది. వరద నుంచి బయటపడేందుకు వారు అక్కడ ఉన్న ఓ చెట్టు కొమ్మలను ఆశ్రయంగా తీసుకున్నారు. కానీ మాలతీ పట్టుకున్న కొమ్మ విరిగపోవడం వల్ల ఆమె వరదలో కొట్టుకుపోయింది. గాలింపు చేపట్టగా.. ఆమె మృతిచెందినట్లు అధికారులు శుక్రవారం గుర్తించారు.