తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు ఎలుకలను 'రెండు' తలలతో ఒకేసారి.. - పాముల వైరల్ వీడియోలు

రెండువైపులా తల ఉన్న పాము కనిపించడమే అరుదు. అలాంటిది ఒకేవైపు రెండు తలలున్న పాము కనపడితే? అంతేగాక.. ఆ పాము ఒకేసారి రెండు ఎలుకలను మింగేస్తే? ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

two headed snake
రెండుతలల పాము

By

Published : Jul 25, 2021, 2:25 PM IST

ఒకేవైపు రెండు తలలు ఉన్న పాము రెండు ఎలుకలను మింగేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఒళ్లు గగుర్పాటు పొడిచే ఈ వీడియోను బ్రియాన్ బార్జిక్ అనే జంతుప్రేమికుడు పంచుకున్నారు. జంతువులు, ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు ఆయన.

"నా జంతు ప్రపంచంలోని పాములు ఇతర జీవులన్నింటినీ వదిలేయండి. ప్రస్తుతం దీని విన్యాసాన్ని చూడండి. ఇదొక సాహసమని నేను అనుకుంటున్నా. అందుకే షేర్ చేయాలనిపించింది."

-బ్రియాన్ బార్జిక్, పాముల సంరక్షణ కేంద్రం, అమెరికా

రెండు తలల పామును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. 'నాకు రెండు తలల పాము కావాలంటే ఎక్కడ దొరుకుతుంది' అని ఒకరు ప్రశ్నించారు.

'ఇంతకు ముందు రెండు తలల పామును ఎప్పుడూ చూడలేదు' అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details