తెలంగాణ

telangana

సోషల్ ఇంజనీరింగ్​తో ట్విట్టర్​పై హ్యాకర్ల దాడి!

By

Published : Jul 18, 2020, 2:07 PM IST

అమెరికాలో సంచలనం రేపుతున్న బిట్​కాయిన్ కుంభకోణంపై ట్విట్టర్ మరో కీలక ప్రకటన చేసింది. హ్యాకర్లు తమ సిబ్బందిని సోషల్ ఇంజనీరింగ్ స్కీమ్​లతో మభ్యపెట్టి వాడుకుని ఉండొచ్చని తెలిపింది.

twitter hacking news
ట్విట్టర్​ బిట్​కాయిన్ కుంభకోణం

హ్యాకర్లు తమ సంస్థలోని కొందరు ఉద్యోగుల్ని నియంత్రించగలిగారని ట్విట్టర్​ తెలిపింది. దానితో వారు తమ అంతర్గత వ్యవస్థలకు సంబంధించిన వివరాలు పొందగలిగారని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోకు సహకరిస్తున్నామని పేర్కొంది.

"కొన్ని వివరాలు తెలిశాయి. ప్రస్తుతం అన్ని ఖాతాలను సరిచేస్తున్నాం. అయితే భద్రతపరమైన కొన్ని విషయాలను చెప్పలేం. ఫొరెన్సిక్‌ సమీక్ష కొనసాగుతోంది" అని ట్విట్టర్‌ తెలిపింది. ప్రముఖులకు సంబంధించిన ప్రైవేటు సందేశాలను హ్యాకర్లు చదివారా లేదా అన్న సంగతిని సంస్థ చెప్పలేదు.

అసలేం జరిగింది..

జులై 15న మధ్యాహ్నం పలువురు ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలు హ్యాక్​ చేసి అందులో బిట్​కాయిన్​కు సంబంధించి పోస్ట్​లు పెట్టారు హ్యాకర్లు. ఖాతాలు హ్యాక్​ అయిన వారి జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, జో బైడెన్​, బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్, జెఫ్‌ బెజోస్‌, ఎలాన్‌ మస్క్‌ సహా సెలబ్రిటీలు కేన్​ వెస్ట్​, అతడి భార్య కిమ్​ కర్దాషియన్​ వంటివారు ఉన్నారు. వీరి అధికారిక ఖాతాలలో అనుమానాస్పద ట్వీట్లు పెట్టారు సైబర్​ కేటుగాళ్లు. క్రిప్టో కరెన్సీ రూపంలో తమకు డొనేషన్లు కావాలని తర్వాత రెట్టింపు చెల్లిస్తామని సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌లు పెట్టినట్లు ట్విట్టర్​ గుర్తించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి ఘటన తీవ్ర చర్చనీయంశంగా మారింది.

ఇదీ చూడండి:'చైనా కుట్రలు తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నం'

ABOUT THE AUTHOR

...view details