తెలంగాణ

telangana

ETV Bharat / international

Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్​ సేవలకు అంతరాయం!

Twitter Down: ట్విట్టర్​ సేవలకు శుక్రవారం స్వల్ప అంతరాయం ఏర్పడింది. టెక్నికల్​ బగ్​ కారణంగా యూజర్లు పోస్టింగ్​, సెర్చింగ్​, షేరింగ్​ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన ట్విట్టర్..​ సమస్యను పరిష్కరించినట్లు ప్రకటించింది.

twitter down
ట్విట్టర్​

By

Published : Feb 12, 2022, 1:30 AM IST

Updated : Feb 12, 2022, 1:44 AM IST

Twitter Down: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్​ సేవలకు శుక్రవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. భారత్​ సహా వివిధ దేశాల్లో దాదాపు గంట పాటు ట్విట్టర్​లో పోస్టింగ్, సెర్చింగ్, కంటెంట్​ షేరింగ్​ చేయడంలో చాలా మంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేశారు. డౌన్​ డిటెక్టర్​ అనే వెబ్​సైట్​ ప్రకారం సుమారు రాత్రి 10.30 గంటలకు ఈ సమస్య మొదలై.. 11 గంటలకు తారస్థాయికి చేరింది.

అదే కారణం..

ఈ విషయంపై స్పందించిన ట్విట్టర్​.. సమస్యను పరిష్కరించామంటూ 11.44 గంటలకు ట్వీట్​ చేసింది. టెక్నికల్​ బగ్​ కారణంగా సేవలకు అంతరాయం కలిగిందని వివరిస్తూ ట్వీట్​ చేసింది. అంతరాయానికి క్షమించాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది.

ట్విట్టర్​ సేవలు అందుబాటులోకి వచ్చాక యూజర్లు ఈ సమస్యపై 'ట్విట్టర్​ డౌన్'​ అనే హ్యాష్​ట్యాగ్​తో ట్రెండ్​ చేశారు.

ఇదీ చూడండి :మస్క్​కు సౌర తుపాను దెబ్బ.. బూడిదైన 40 స్పేస్​ఎక్స్​ ఉపగ్రహాలు

Last Updated : Feb 12, 2022, 1:44 AM IST

ABOUT THE AUTHOR

...view details