తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2019, 12:18 PM IST

ETV Bharat / international

ట్విట్టర్​ సీఈఓ వార్షిక వేతనం 1.4 డాలర్లు..!

2015 నుంచి 2017 వరకు వరుసగా 3 సంవత్సరాలు ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా ఉన్న ట్విట్టర్​ సీఈఓ జాక్ డోర్సే 2018 లో మాత్రం జీతం పుచ్చుకున్నారు. అది కూడా కేవలం 1.4 డాలర్లు. ఒక ట్వీట్​ పరిధికి గరిష్ఠంగా ఉండే 140 అక్షరాలకు గుర్తుగా 1.4 డాలర్ల వేతనం అందుకున్నారు డోర్సే. 140లో ఒక శాతం 1.4.

ట్విట్టర్​ సీఈఓ ఏడాది వేతనం 1.4 డాలర్లు

2015 నుంచి సంస్థ కల్పిస్తున్న పరిహారం, ప్రయోజనాలకు దూరంగా ఉంటున్న ట్విట్టర్ సీఈఓ(ముఖ్య కార్యనిర్వాహణాధికారి) జాక్​ డోర్సే... 2018లో మాత్రం వేతనం అందుకున్నారు. ఆ మొత్తం ఎన్నో బిలియన్​ డాలర్లు ఉంటుందనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. డోర్సే 1.4 డాలర్ల వేతనం మాత్రమే అందుకున్నారు. ఇదే విషయాన్ని యూఎస్​ సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్చేంజ్​ కమిషన్​(ఎస్​ఈసీ)కు తెలిపింది ట్విట్టర్​ సంస్థ.

"ట్విట్టర్​ను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనే నిబద్ధతతో... సంస్థ అందిస్తున్న పరిహారం, ప్రయోజనాలకు.. 2015, 16, 17లో దూరంగా ఉన్న సీఈఓ జాక్​ డోర్సే 2018 లోనూ అదే పునరావృతం చేశారు. అయితే గతేడాది 1.4 డాలర్ల వేతనం మాత్రమే అందుకున్నారు."
- ట్విట్టర్​

ఒక ట్వీట్​కు గరిష్ఠంగా ఉండే 140 అక్షరాలకు చిహ్నంగా జాక్​ డోర్సే 1.4 డాలర్ల వేతనం పుచ్చుకున్నారని అమెరికా మీడియా సంస్థ సీనెట్ తెలిపింది.

"బహుశా డోర్సే త్వరలో తన వేతనాన్ని రెండింతలు (2.8 డాలర్లు) చేయనున్నారేమో? బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​, డోర్సే ఈ మొత్తానికి అంగీకారం తెలిపే అవకాశాలున్నాయి. ఎందుకంటే ట్వీట్​లోని 140 అక్షరాల పరిధిని 280కి పెంచేందుకు ట్విట్టర్​ సిద్ధమవుతోంది."
- సీనెట్​

డోర్సే... 16 మిలియన్​ షేర్లు

ట్విట్టర్​లో జాక్​ డోర్సేకు 16 మిలియన్​ షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 557 బిలియన్​ డాలర్లు ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details