సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈసారి అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా హ్యాకర్లు ట్విటర్ ఖాతాలపై దాడి చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఎలాన్ ముస్క్‌తో పాటు మరికొందరి ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయినట్లు సమాచారం. వీరి అధికారిక ఖాతాలలో అనుమానాస్పద ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. వీటన్నింటిలోనూ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ స్కాం ముఠానే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్.. అసలేమైంది? - twitter accounts hacked
అమెరికాలో ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్ వంటి ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. స్పందించిన ట్విట్టర్ లోపాలను సరిదిద్దుతామని ప్రకటించింది.
ప్రముఖుల ఖాతాల హ్యాక్ విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ టీం అధికారికంగా ధ్రువీకరించింది. ప్రముఖుల ఖాతాలు హ్యాకర్ల బారినపడినట్లు గుర్తించిన వెంటనే వాటిని కాపాడామని వెల్లడించింది. ఆయా ట్వీట్‌లను ఇప్పటికే డిలీట్ చేసింది. తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా వెరిఫైడ్ ఖాతాలే లక్ష్యంగా హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపడమే గాక సెక్యూరిటీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి: పాంపియో