అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో స్పందించారు. ట్రంప్ పర్యటన... భారత్తో అమెరికాకు ఉన్న అనుబంధాన్ని నిరూపిస్తోందని తెలిపారు. ఈ వారం రోజల్లో భారత్- అమెరికా మైత్రి ఎంతో పురోగతి సాధించిందని ట్వీట్ చేశారు.
"భారత్లోఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఎంతో బలపరిచింది. ప్రజస్వామ్య సంస్క్రతులు మమ్మల్ని ఏకం చేశాయి. ఒకే విధమైన ఆసక్తులు మా బంధాన్ని మరింత దృఢపరిచాయి. అధ్యక్షుడి నాయకత్వంలో మా భాగస్వామ్యం ఎల్లప్పుడు బలపడుతూనే ఉంటుంది."