తెలంగాణ

telangana

ETV Bharat / international

'నా ఆరోగ్యం భేష్​.. మీడియాకే అనారోగ్యం'

మీడియాపై మరోమారు అసహనం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మీడియానే అనారోగ్యంగా ఉందని మండిపడ్డారు.

'నేను పుష్టిగా ఉన్నా.. మీడియానే అనారోగ్యంగా ఉంది'

By

Published : Nov 20, 2019, 1:31 PM IST

అమెరికా అధ్యక్షుడు అనారోగ్యంగా ఉన్నారంటూ ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సాధారణ పరీక్షల కోసమే వాల్టర్ రీడ్​లోని ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. మీడియాను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు.

"వారే(మీడియా) అనారోగ్యంగా ఉన్నారు. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదు. మన మీడియాలో చాలా అవినీతి ఉంది. వారు తమ పని సక్రమంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను శారీరక పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లాను."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

గతవారం ఆసుపత్రికి ట్రంప్

సాధారణ వైద్య పరీక్షల కోసం.. గత శనివారం వాల్టర్ రీడ్ మిలటరీ ఆసుపత్రికి వెళ్లారు ట్రంప్​. ఈ నేపథ్యంలో అమెరికాలోని పలు వార్తా సంస్థలు అధ్యక్షుడి ఆరోగ్యం బాగాలేదంటూ వార్తలు రాశాయి. ట్రంప్​ గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరారంటూ మరికొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ అవన్నీ అసత్య కథనాలంటూ కొట్టిపారేశారు.

అంతా మంచిదే

అధ్యక్షుడికి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ట్రంప్​కు ఎలాంటి ఛాతి నొప్పి రాలేదని అధ్యక్షుడి ప్రత్యేక వైద్యుడు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details