అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఫేస్బుక్(Facebook) ఖాతాను రెండేళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయంపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.
" జనవరి 6న ఫేస్బుక్ ద్వారా ట్రంప్(Donald Trump) చేసిన పోస్టులు మా సంస్థ నియమాలను ఉల్లంఘించాయి. మేం డొనాల్డ్ ట్రంప్ ఖాతాను రెండు సంవత్సరాల పాటు తొలగిస్తున్నాము. ఇది ఈ ఏడాది జనవరి 7 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకా 19 నెలలు కొనసాగుతుంది."