హెచ్1బీ, ఎల్1బీ వీసాలు రద్దు చేయడం వల్ల అమెరికాలోని కంపెనీలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రముఖ పరిశోధనా సంస్థ బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను రాకుండా అడ్డుకోడవం వల్ల ప్రైవేటు సంస్థలు దాదాపు వంద బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు వెల్లడించింది.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్, భారతీయ- అమెరికన్ పృథ్వీరాజ్ చౌదరి, బ్రూకింగ్స్ సంస్థ నుంచి డానీ బహస్ర్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బ్రిట్టా గ్లెన్నన్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు.
హెచ్1బీ, ఎల్1బీ వీసాలను రద్దు చేస్తూ జూన్ 22న కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు ట్రంప్. ఈ నిర్ణయం భారత ఐటీ నిపుణుల డాలర్ డ్రీమ్స్‌ను చెదరగొట్టింది. ఆ దేశంలోని దాదాపు 500కంపెనీలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది.
దాదాపు 2లక్షల మంది విదేశీ కార్మికులు, వారిపై ఆధారపడ్డ వారిని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వలు అడ్డుకున్నట్లు బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్ నివేదిక చెబుతోంది. ప్రతిభావంతులైన వలసదారుల వల్ల లాభాలు, సృజనాత్మకత, పెట్టుబడులు పెరుగుతాయనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని వివరించింది.