తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 9:50 AM IST

ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​పై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

ప్రాణాంతక కరోనా మహమ్మారికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ట్రంప్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. అమెరికా ఆరోగ్య అధికారులు మాత్రం టీకా​ అభివృద్ధి చేసేందుకు సంవత్సరం నుంచి 18 నెలలు పట్టొచ్చని అంటున్నారు.

Trump: vaccine will be available by year's end
కరోనా వ్యాక్సిన్​పై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు సాగుతున్న వేళ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా.. తమ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.

వైరస్‌ నివారణకు ప్రస్తుతానికి రెమిడెసివర్‌ అద్భుతంగా పనిచేస్తోందని.. దాని అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ట్రంప్‌ తెలిపారు. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న ఓ వ్యక్తితో మాట్లాడిన ట్రంప్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా శ్వేతసౌధంలోని కరోనా టాస్క్​ఫోర్స్​ సభ్యుడు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డా.ఆంటోనీ ఫౌచీ గత నెలలో... వ్యాక్సిన్​ వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తే జనవరిలోగా పంపిణీ చేయొచ్చని అన్నారు. నిపుణులు మాత్రం కరోనా టీకా అభివృద్ధి చేసేందుకు దాదాపు 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రజా ఆరోగ్య అధికారులూ ఇదే మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విస్తృత పరిశోధనలు..

కొవిడ్​ వ్యాక్సిన్​ కోసం ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాల్లో విస్తృతంగా ఉమ్మడి పరిశోధనలు సాగుతున్నాయి. సంబంధిత ప్రాజెక్టుల కోసం దాదాపు 8 బిలియన్​ డాలర్లు వెచ్చించాలని ప్రతిజ్ఞ చేశాయి. బ్రిటన్​లో ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాపై క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు. ఇంకా పలు దేశాల్లో వైరస్​ విరుగుడును కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details