ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలన్నీ తిరిగి అమలు చేయాలని అమెరికా డిమాండ్ చేయనున్నట్లు ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టెహ్రాన్‌కు వ్యతిరేకంగా ఆయుధ ఆంక్షలు విస్తరించటంలో అమెరికా విఫలమైన క్రమంలో ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై తక్షణం యూఎన్ ఆంక్షలు పునరుద్ధరించాలని ట్రంప్ పరిపాలన విభాగం పట్టుబడుతున్న నేపథ్యంలో వివాదానికి దారితీసింది. స్నాప్‌బ్యాక్ విధానం ద్వారా ఇరాన్‌పై యూఎన్ ఆంక్షలను పునరుద్ధరించాలని అమెరికా చూస్తోంది. ఈ విధానాన్ని 2015 అణ్వాయుధ ఒప్పందంలో ఆమోదించారు. అయితే..అమెరికా పిలుపును ఐరాస భద్రతా మండలిలోని ఇతర సభ్య దేశాలు తోసిపుచ్చే అవకాశం ఉంది.
2015 అణు ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో ఇరాన్ విఫలమైంది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో గురవారం న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశంలో.. ఇరాన్‌పై ఆంక్షలు పునరుద్ధరించాలనే అమెరికా డిమాండ్‌ను తెలియజేస్తారు. ఇది తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండబోవు. నేను ఎన్నికల్లో గెలిచిన నెల రోజల్లోనే ఇరాన్ మా దగ్గరకు వస్తుంది. మాతో ఒప్పందం చేసుకునేందుకు అభ్యర్థిస్తుంది.
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.