తెలంగాణ

telangana

ETV Bharat / international

అభిశంసన: ట్రంప్​-బిడెన్​ల మధ్య మాటల యుద్ధం - అభిశంసన: ట్రంప్​-బిడెన్​ల మధ్య మాటల యుద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రటిక్​ నాయకుడు జో బిడెన్​ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బిడెన్​, ఆయన కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు ట్రంప్​. ఇక ఇంతటితో ఆపాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ట్రంప్​ ఆరోపణలను తిప్పికొట్టారు బిడెన్​. కుట్ర సిద్ధాంతాలు తనపై పనిచేయవని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

By

Published : Oct 7, 2019, 6:15 AM IST

అభిశంసన: ట్రంప్​-బిడెన్​ల మధ్య మాటల యుద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రటిక్​ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసనతో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమొక్రాట్​ నాయకుడు, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి జో బిడెన్​పై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్​. బిడెన్​, ఆయన కుటుంబం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. దీనిని ఆపాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ఉక్రెయిన్​ సంస్థల్లోని అవినీతి నుంచి ఆయన కుమారుడు హంటర్​ను రక్షించేందుకు బిడెన్ కలగజేసుకుంటున్నారని పేర్కొన్నారు ట్రంప్​. ఎలాంటి అనుభవం లేని రంగంలో చైనా సంస్థలతో ఒప్పందం చేసుకుని సుమారు 1.5 బిలియన్​ డాలర్ల మేర లబ్ధి పొందారని ఆరోపించారు.

ట్రంప్​ ట్వీట్​

కుట్ర సిద్ధాతాలు పనిచేయవు..

ట్రంప్​ ఆరోపణలను తిప్పకొట్టారు బిడెన్​. తనపై అబద్ధాలు వ్యాప్తి చేయాలని ట్రంప్​ చూస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు ఆయన కుటుంబంపై కుట్రలు పన్నుతున్నారని.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కానీ తనపై కుట్ర సిద్ధాంతాలు పని చేయవన్నారు. అమెరికా ప్రజలకు తన గురించి, ట్రంప్​ గురించి తెలుసునన్నారు. దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలిపారు బిడెన్​. ట్రంప్​ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కేన్సస్ బార్​లో​ మళ్లీ కాల్పులు- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details