అమెరికాలో వీసాల జారీపై చట్టసభల సభ్యులు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. కరోనా కారణంగా రెండు కోట్ల అరవై లక్షలమంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారని.. వీరికి ఉద్యోగాలు కల్పించేందుకు వీసాల జారీ ప్రక్రియను నిలిపేయాలని పలువురు కోరుతున్నారు. అయితే దేశానికి అవసరమైన వైద్యసిబ్బందిని రప్పించేందుకు వీసాల జారీ కొనసాగాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రీన్‌కార్డుల జారీని 60 రోజులపాటు నిలిపేసిన అధ్యక్షుడు ట్రంప్ విదేశీయుల రాకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'వారిని నిలువరించాలి..'
హెచ్1బీ సహా విదేశీ ఉద్యోగుల నియామకాలను తాత్కాలికంగా రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విన్నవించారు అమెరికా చట్టసభ సభ్యుడు పాల్ గోసర్. హెచ్1బీ, హెచ్4, ఎల్1, బీ1, బీ2 వీసాలు.. విదేశీయులకు ప్రాక్టికల్ శిక్షణ, గెస్ట్ సిబ్బంది నియామకాలను నిలిపేయాలని కోరారు.
"కరోనా కారణంగా ఇప్పటివరకు రెండుకోట్ల అరవై లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారు. ఇక చేపట్టాల్సింది ఏమైనా ఉందంటే అది విదేశీ ఉద్యోగులను నిలువరించడమే."
-పాల్ గోసర్, అమెరికా చట్టసభ సభ్యుడు
అధ్యక్షుడు ప్రకటించిన గ్రీన్ కార్డుల జారీ నిలిపివేత.. అమెరికా ఫస్ట్ నినాదం దిశగా సరైనదేనని అభిప్రాయపడ్డారు గోసర్. అయితే విదేశాంగ, రక్షణ, హోం శాఖ మంత్రులు.. విదేశీ ఉద్యోగుల రాకను నిలిపేయాలని సిఫార్సు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయడానికి ఇంతకంటే సరైన సమయం ఉండదన్నారు గోసర్.
వైద్య నిపుణుల కోసం