అమెరికాలో టిక్‌టాక్ సహా చైనాకు చెందిన మొబైల్ యాప్‌లను నిషేధించాలని... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 24 మంది రిపబ్లికన్ చట్టసభ్యులు కోరారు. చైనాకు చెందిన 59 యాప్‌లను... జాతీయ భద్రతా సమస్యల కారణంగా భారత్ నిషేధించిన విషయాన్ని వారు అధ్యక్షునికి గుర్తుచేశారు.
చైనాకు చెందిన యాప్‌లు అమెరికన్ వినియోగదారుల డేటాను సేకరిస్తున్నాయి. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సహా మిగతా చైనా కంపెనీలు... చైనా సైబర్ సెక్యూరిటీ చట్టాల మేరకు ఈ సమాచారాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)తో పంచుకుంటున్నాయి. దీని వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉంది."
- రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుల లేఖ సారాంశం
చైనా యాప్‌ల వల్ల అమెరికన్ ప్రజల గోప్యత, భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ సభ్యులు.. ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు.
డేటా మైనింగ్