ఇరాన్ రెండో అతి శక్తిమంతమైన వ్యక్తి ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన అనంతరం పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ మరోసారి దూకుడు ప్రదర్శించారు.
ఇరాన్ వద్ద ఇక అణ్వాయుధాలు ఉండనివ్వకుండా చేస్తామంటూ ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సులేమానీ మరణంతో ఇవి తారస్థాయికి చేరాయి.