తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస వేదికగా చైనాకు ట్రంప్​ గట్టి సందేశం! - ఐరాస సాధారణ అసెంబ్లీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. మరికొన్ని రోజుల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా చైనాకు గట్టి సందేశాన్ని ట్రంప్​ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావం సహా చైనాతో వాణిజ్య వివాదం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నట్టు ట్రంప్​ ఇప్పటికే స్పష్టం చేశారు.

Trump to send sharp message to China in his UN speech
ట్రంప్​ ఐరాస ప్రసంగంలో చైనాకు గట్టి సందేశం!

By

Published : Sep 22, 2020, 12:31 PM IST

ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో చేసే ప్రసంగాన్ని.. చైనా వైఖరిని నిరసిస్తూ గట్టి సందేశం ఇవ్వడానికి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలుచుకుంటున్నట్లు సమాచారం. వీడియో సందేశాన్ని రికార్డు చేయనున్న ట్రంప్‌.. కరోనా మహమ్మారి ప్రభావం సహా చైనాతో వాణిజ్య వివాదం, ఉత్తరకొరియా, ఇరాన్‌ నుంచి పొంచి ఉన్న ముప్పులు తదితరాలను తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. ఈ మేరకు పాత్రికేయులకు తెలిపిన ఆయన.. చైనాకు మాత్రం తమ ప్రసంగం ద్వారా గట్టి సమాధానం చెప్పనున్నట్లు వివరించారు. అది ఏ అంశంలో అన్నది మాత్రం చెప్పలేదు.

2016లో అధికారం చేపట్టాక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తన ఫ్లోరిడా క్లబ్‌లో.. సాదర ఆతిథ్యం ఇచ్చారు ట్రంప్. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయి ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు.. మాటలదాడి చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి:-ట్రంప్‌పై విష ప్రయోగానికి కుట్ర పన్నిన మహిళ అరెస్ట్‌!

ABOUT THE AUTHOR

...view details