అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్ష హోదాలో చివరిసారిగా మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కి.. ఫ్లోరిడాలోని తన శాశ్వత నివాసానికి బయలుదేరారు. ఇప్పటికే శ్వేతసౌధంలోని ఆయన సామగ్రిని ఫ్లోరిడా పామ్ బీచ్‌లో ఉన్న 'మార్-ఏ-లాగు' ఎస్టేట్‌కు తరలించారు.
వాషింగ్టన్ వీడే ముందు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్.
" ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైనవి. మనమంతా కలిసికట్టుగా చాలా సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి కృతజ్ఞతలు. మీ ప్రయత్నాలకు నా కృతజ్ఞతలు. ఈ కుటుంబం ఎంత కష్టపడి పనిచేసిందో ప్రజలకు తెలియదు "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
శీతాకాల వైట్హౌస్గా పిలిచే మార్-ఏ-లాగు ఎస్టేట్‌లో ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎక్కువ కాలం గడిపారు. 2019 తరువాత ట్రంప్ తన అధికారం నివాసంగా కూడా మార్-ఏ-లాగు ను మార్చారు. సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఎస్టేట్‌లో 128 గదులు ఉన్నాయి. 5 టెన్నిస్ కోర్టులు, 20 వేల చదరపు అడుగుల్లో ఫుట్‌బాల్ రూం, వాటర్ ఫ్రంట్ రూం లాంటి అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రైవేట్ క్లబ్‌గా ఉండగా.. ట్రంప్‌కు మాత్రం ఇందులో ప్రత్యేక వసతి గదులు ఉన్నాయి. మార్కెట్ అంచనా ప్రకారం దీని విలువ సుమారు రూ. 12 వేల కోట్ల వరకు ఉంటుంది.
ఇదీ చూడండి: కరుణామయుడైన ట్రంప్- 143మందికి క్షమాభిక్ష