అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. పోలింగ్‌కు ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో కీలకమైన రాష్ట్రాలపై దృష్టి సారించారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరేందుకు 3 రోజుల్లోనే 14 ర్యాలీలు నిర్వహించినున్నారు. ఈ మేరకు ట్రంప్ ప్రచార విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
ఒక్క పెన్సిల్వేనియా రాష్ట్రంలోనే 4 సభలకు హాజరుకానున్నారు ట్రంప్. గతేడాది ఆ రాష్ట్రంలో 48.18శాతం బ్యాలెట్ ఓట్లతో ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారింది. తాజాగా సర్వేల్లో బైడెన్ 51 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 46 శాతానికే పరిమితయ్యారు. అందుకే పెన్సిల్వేనియాపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు.