ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలపై కొత్త నియంత్రణలు విధిస్తానని, అవసరమైతే మూసేయడానికి కూడా వెనుకాడబోనని ఉద్ఘాటించారు. ఇటీవలే ట్విట్టర్ వేదికగా తాను టేసిన ట్వీట్లలో తప్పుడు సమాచారం ఉందంటూ.. ఆ సంస్థ ఫ్యాక్ట్ చెక్ వార్నింగ్ పంపిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐటీ దిగ్గజ కంపెనీలు సంప్రదాయవాదుల గొంతు నొక్కుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ట్విట్టర్ గురించి తాము చెబుతున్నందంతా నిజమే అని ఆ సంస్ధ ఇప్పుడు అంగీకరిస్తోందని అన్నారు. వారిపై పెద్ద చర్య సిద్ధంగా ఉందని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.