చైనాతో వాణిజ్య యుద్ధ వాతావరణం సద్దుమణగకముందే... భారత్ పై సుంకాల బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం విధిస్తామని హెచ్చరించారు. 'భారత్ అధిక సుంకాల దేశం' అని ఆరోపించారు ట్రంప్.
'అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం సుంకం విధిస్తోంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా విధిస్తోన్న సుంకం శాతం సున్నా. మేం తెలివితక్కువ వాళ్లం అనుకుంటున్నారా?. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలి. లేదంటే పరస్పర పన్ను(రెసిప్రోకల్ ట్యాక్స్) లెక్కన భారత్ వస్తువులపైనా వంద శాతం సుంకం విధించేందుకు వెనకాడబోం ' -- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు